ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు | Evaru Lerani Evaru Lerani Enduku Edusthunnavu Telugu Christian Song with Lyrics
పల్లవి:
- ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు?
- యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు?
- నా రాతింతేనని నా బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు?
- యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు?
- నీవు మరచిన నిన్ను మరువడు నీవు విడిచినా నిన్ను విడువడు
- నీ తోడుగా నీ నీడగా నీ తోడే ఉండును కన్నీరు తుడుచును
చరణం: 01
- ఏమీ లేదు నీకని ఎవరు లేరు నీకని
- ఎందుకు నీ బ్రతుకని నీతో ఉన్నవారన్నారా
- నీ బ్రతుకే వ్యర్ధమని అందరికి భారమని
- నీ ముఖము చూపకని ముఖము తిప్పుకున్నారా
- ఒంటిరివి నీవు కావు తోడు యేసున్నాడు.
- అనాథవు నీవు కావు నీ అండగ యేసున్నాడు. ||2||
- ఎవరూ లేరని ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
- యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
చరణం: 02
- నిలువ నీడ లేదని నీకు విలువ లేదని
- పనికిరావు నీవని నిన్ను త్రోసి వేసారా
- మననసుకేమో గాయమని మరణిస్తే మేలని
- మరణమే మార్గమని మంచి రోజు లేవని
- ఏడువకు నీవు నీ కన్నిరేసు తుడుచును
- తొందర పడకు నీవు నీ స్థితి యేసయ్యా మార్చును ||2||
- ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
- యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
Song Details :-
- Lyrics:
- Singer:
- Music:
No comments:
Post a Comment