Monday, 27 September 2021

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు - Oohinchaleni Kaaryamulu

  VINAYS INFO       Monday, 27 September 2021

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు - Oohinchaleni Kaaryamulu

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు

కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)

దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు

ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు

ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే

కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము

||ఊహించలేని||



ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం

ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)

కలవాలి హృదయాలు ఒకటై

పండాలి నూరేళ్లు ఇకపై (2)

వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ

||ఊహించలేని||


దేవుని సముఖములో బ్రతకాలి మీరు

మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)

లోబడి ఉండాలి వధువు

ప్రేమను పంచాలి వరుడు (2)

దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి 

||ఊహించలేని||

logoblog

Thanks for reading ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు - Oohinchaleni Kaaryamulu

Previous
« Prev Post

No comments:

Post a Comment