Sunday, 26 September 2021

మంగళమే యేసునకు – మానుజావతారునకు - Mangalame Yesunaku

  VINAYS INFO       Sunday, 26 September 2021

మంగళమే యేసునకు – మానుజావతారునకు - Mangalame Yesunaku

మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)

శృంగార ప్రభువునకు (2)

        క్షేమాధిపతికి మంగళమే           

||మంగళమే||


పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)

నిరుపమానందునకు (2)

నిపుణ వేద్యునకు మంగళమే           

||మంగళమే||


దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)

కరుణా సంపన్నునకు (2)

జ్ఞాన దీప్తునకు మంగళమే           

||మంగళమే||


సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)

నిత్య స్వయంజీవునకు (2)

నిర్మలాత్మునకు మంగళమే           

||మంగళమే||


యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)

సత్య పరంజ్యోతి యగు (2)

సార్వభౌమునకు మంగళమే           

||మంగళమే||


నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)

కరుదెంచిన మా పాలి (2)

వర రక్షకునకు మంగళమే           

||మంగళమే||


పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)

పరమేశ్వర తనయునకు (2)

బ్రణుతింతుము నిన్ను మంగళమే           

||మంగళమే||



logoblog

Thanks for reading మంగళమే యేసునకు – మానుజావతారునకు - Mangalame Yesunaku

Previous
« Prev Post

No comments:

Post a Comment