Sunday, 26 September 2021

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము - Iddarokkatiga Maareti

  VINAYS INFO       Sunday, 26 September 2021

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము - Iddarokkatiga Maareti

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము

దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)

వివాహమన్నది అన్నింట ఘనమైనది

ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)


ఒంటరైన ఆదామును చూసి

జంట కావాలని మది తలచి (2)

హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను

సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2)

||వివాహమన్నది||


ఏక మనసుతో ముందుకు సాగి

జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)

సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని

సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2)

||వివాహమన్నది||


భార్య భర్తలు సమానమంటూ

ఒకరి కోసము ఒకరనుకుంటూ (2)

క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి

సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) 

 ||వివాహమన్నది||

పాట రచయిత: సాయరాం గట్టు



logoblog

Thanks for reading ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము - Iddarokkatiga Maareti

Previous
« Prev Post

No comments:

Post a Comment