Thursday, 23 September 2021

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను - Chinna Chinna Gorre Pillanu

  VINAYS INFO       Thursday, 23 September 2021

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను

యేసు ప్రియ బిడ్డను (2)

సంతసముగ సాగిపోయెదన్ (2)

చెంత యేసు నాతో ఉండగా (2)     ||చిన్న||


ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా

తోడేళ్ళ మధ్యలో సంచరించినా (2)

తొట్రిల్లను నేను చింతించను (2)

తోడుగా నా యేసు ఉండగా (2)     ||చిన్న||


పచ్చికగల చోటికి నన్ను నడుపును

శాంత జలముతో నన్ను తృప్తి పరచును (2)

నా కాపరి నా ప్రియుడేసుడే (2)

చిరకాలము నన్ను కాయును (2)     ||చిన్న||



logoblog

Thanks for reading చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను - Chinna Chinna Gorre Pillanu

Previous
« Prev Post

No comments:

Post a Comment