Friday, 24 September 2021

ఆనందింతు నీలో దేవా ... Anandithu nilo deva

  Samson       Friday, 24 September 2021

ఆనందింతు నీలో దేవా ... Anandithu nilo deva

ఆనందింతు నీలో దేవా

అనుదినం నిను స్తుతించుచు (2)

మధురమైన నీ నామమునే (2)

మరువక ధ్యానించెద ప్రభువా           ||ఆనందింతు||


ఆత్మ నాథా అదృశ్య దేవా

అఖిల చరాలకు ఆధారుండా (2)

అనయము నిను మది కొనియాడుచునే

ఆనందింతు ఆశ తీర (2)         ||ఆనందింతు||


నాదు జనములు నను విడచినను

నన్ను నీవు విడువకుండా (2)

నీ కను దృష్టి నాపై నుంచి

నాకు రక్షణ శృంగమైన (2)         ||ఆనందింతు||


శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు

మేఘమందు రానైయున్న (2)

ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు

అంతం వరకును భద్రపరచుము (2)         ||ఆనందింతు||


శ్రమలు నన్ను చుట్టిన వేళ

చింతలో కృశించిన వేళ (2)

అభయముగా నీ దర్శనమిచ్చి

శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2)         ||ఆనందింతు||





logoblog

Thanks for reading ఆనందింతు నీలో దేవా ... Anandithu nilo deva

Previous
« Prev Post

No comments:

Post a Comment