Saturday, 25 September 2021

ఆ నింగిలో వెలిగింది ఒక తార - Aa Ningilo Veligindi Oka Thaara

  VINAYS INFO       Saturday, 25 September 2021

 ఆ నింగిలో వెలిగింది ఒక తార - Aa Ningilo Veligindi Oka Thaara

ఆ నింగిలో వెలిగింది ఒక తార

మా గుండెలో ఆనందాల సితార

నిజ ప్రేమను చూసాము కళ్ళారా

ఈ లోకంలో నీ జన్మము ద్వారా

ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల

హృదయంలోని యేసు పుట్టిన వేళ

ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల

మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ

యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ

యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ

యేషు మేరా గాన్ హాయ్ తూ

యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ


లోకంలో యాడ చూసిన శోకాలేనట

పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట

అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట

అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట

విశ్వాన్ని సృష్టించిన దేవుడంట

పశువుల పాకలోన పుట్టాడంట

పాటలు పాడి ఆరాధించి

నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్            ||యేషు||


చీకటిలో చిక్కుకున్న బీదవారట

చలి గాలిలో సాగుతున్న గొల్లవారట

అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట

వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట

దావీదు పట్టణమందు దేవుడంట

మనకొరకై భువిలో తానే పుట్టాడంట

వేగమే వెళ్లి నాథుని చూసి

పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్            ||యేషు||



పాట రచయిత: బన్ని సుదర్శన్

logoblog

Thanks for reading ఆ నింగిలో వెలిగింది ఒక తార - Aa Ningilo Veligindi Oka Thaara

Previous
« Prev Post

No comments:

Post a Comment