దీనుడా అజేయుడ - Deenuda ajeyuda.
దీనుడా అజేయుడ – ఆదరణ కిరణమా
పూజ్యుడ పరిపూర్ణుడ – ఆనంద నిలయమ
జీవదాతవు నీవని శృతి మించి పాడనా
జీవధారము నీవని కానుకనై పూజించనా (2 )
అక్షయ దీపము నీవే – నా రక్షణ శృంగము నీవే
స్వరార్చనచేసెద నీకే – నా స్తుతులర్పించెద నీకే
దీనుడా అజేయుడ – ఆదరణ కిరణమా
పూజ్యుడ పరిపూర్ణుడ – ఆనంద నిలయమ
1. సమ్మతిలేని సుడిగుండలే – ఆవరించగా
గమనములేని పోరాటాలే – తరుముచుండగా
నిరుపేదనైన నా యెడల – సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి – సిలువచాటునే దాచావు (2)
సంతోషము నీవే – అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే – వజ్రసకల్పము నీవే
దీనుడా అజేయుడ ఆదరణ కిరణమా
పూజ్యుడ పరిపూర్ణుడ ఆనంద నిలయమ
2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే – మార్గదర్శివై
నిత్య నిబంధన నాతోచేసిన – సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో – హృదయర్చనే చేసెద
కరుణ నీడలో – కృపావాడలో – నీతో ఉంటే చాలయ్యా (2)
కర్తవ్యము నీవే – కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే – విజయశిఖరము నీవేగ
దీనుడా అజేయుడ ఆదరణ కిరణమా
పూజ్యుడ పరిపూర్ణుడ ఆనంద నిలయమ
3. ఊహకందని ఉన్నతమైనది – దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది – నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై – మహిమాత్మతో నింపినావు
అమరలోకన – నీసన్నిధిలో – క్రొత్త కీర్తనేపాడేదను (2 )
ఉత్సాహము నీవే – నాయనోత్సవం నీవేగ
ఉల్లాసము నీలో – ఊహలపల్లకి నీవేగ
దీనుడా అజేయుడ – ఆదరణ కిరణమా
పూజ్యుడ పరిపూర్ణుడ – ఆనంద నిలయమ ” 2 “
జీవదాతవు నీవని శృతి మించి పాడనా
జీవధారము నీవని కానుకనై పూజించనా ” 2 “
అక్షయ దీపము నీవే – నా రక్షణ శృంగము నీవే
స్వరార్చనచేసెద నీకే – నా స్తుతులర్పించెద
 
 
 
No comments:
Post a Comment