అదిగో నా నావ బయలు దేరుచున్నది - Adigo Naa Naava Bayalu Deruchunnadi
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా (2)
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో||
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో||
 
 
 
No comments:
Post a Comment